Tuesday, 12 August 2014

World's first 3D-printed space camera to be ready soon

In a boost to space exploration, will complete building the world's first imaging telescope made entirely from 3D-printed parts by next month. 

NASA aerospace engineer Jason Budinoff is expected to complete the first imaging telescopes ever assembled almost exclusively from 3-D-manufactured components by the end of September. 

"As far as I know, we are the first to attempt to build an entire instrument with 3-D printing," said Budinoff, who works at NASA's Goddard Space Flight Centre in Greenbelt, Maryland. 

Budinoff is building a fully functional, 50-millimetre camera whose outer tube, baffles and optical mounts are all printed as a single structure. 

The instrument is appropriately sized for a CubeSat, a tiny satellite comprised of individual units each about four inches on a side. 

The instrument will be equipped with conventionally fabricated mirrors and glass lenses and will undergo vibration and thermal-vacuum testing next year. 

Budinoff also is assembling a 350-millimetre dual-channel telescope whose size is more representative of a typical space telescope. 

He is developing both to show that telescope and instrument structures can benefit from advances in 3-D, or additive, manufacturing. 

With this technique, a computer-controlled laser melts and fuses metal powder in precise locations as indicated by a 3-D computer-aided design (CAD) model. 

Because components are built layer by layer, it is possible to design internal features and passages that could not be cast or machined using more traditional manufacturing approaches. 

"When we build telescopes for science instruments, it usually involves hundreds of pieces. These components are complex and very expensive to build. But with 3-D printing, we can reduce the overall number of parts and make them with nearly arbitrary geometries. We're not limited by traditional mill- and lathe-fabrication operations," said Budinoff. 

In particular, the two-inch instrument design involves the fabrication of four different pieces made from powdered aluminium and titanium. 

A comparable, traditionally manufactured camera would require between five and 10 times the number of parts, he said. 

The instrument's baffling - the component that helps reduce stray light in telescopes - is angled in a pattern that instrument builders cannot create with traditional manufacturing approaches in a single piece.

Tuesday, 5 August 2014

woweinformation: భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన

woweinformation: భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన: 1) DON’T SMOKE: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక cigarette కాల్చితే పది cigarettesకు సమానము అని చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అ...

భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన



1) DON’T SMOKE:
ధూమపానము చేయరాదు.
భోజనము చేసినతరువాత ఒక cigarette
కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
2) DON’T EAT FRUITS:
పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత
పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో
నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
3) DON’T DRINK TEA:
టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
4) DON’T LOOSEN YOUR BELT:
బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు)
దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న
ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
5) DON’T BATH:
స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి
పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల
జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6) DON’T SLEEP:
నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే
ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా
పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది
అంటున్నారు డాక్టర్లు.

Thursday, 31 July 2014

Why Israel Attacking on Gaza ?




పాలస్తీనా పశ్చిమాసియాలో మధ్యధరా సముద్రానికీ జోర్డాన్ నదికీ మధ్య ఉన్న భూభాగం. పాలస్తీనియన్లు అరబ్బులలో భాగమైన ఒక జాతి. చరిత్రలో పాలస్తీనా ప్రస్తావనలు కనీసం రెండువేల ఐదు వందల ఏళ్లుగా ఉన్నాయి. దీనిలో అత్యధిక భాగం గాని, విడివిడి భాగాలుగా గాని పందొమ్మిదో శతాబ్దం వరకూ అనేక సామ్రాజ్యాలలో భాగంగా ఉన్నాయి. జూడాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బహాయి వంటి మతాలన్నిటికీ ప్రధానమైన కేంద్రాలు ఈ భూభాగంలోనే ఉన్నందువల్ల ఆయా మతాల ప్రజలందరికీ ఈ ప్రాంతం తమకే చెందాలన్న ఆకాంక్షలున్నాయి. దానితో పాటు పశ్చిమాసియాలో, చమురు ఉత్పాదక గల్ఫ్ దేశాలకు పొరుగున ఉండడం వల్ల కూడ ఈ ప్రాంతపు ప్రాధాన్యత పెరిగిపోయింది.

పందొమ్మిదో శతాబ్దం మధ్యలో ఈ భూభాగాన్ని టర్కిష్ ఆటోమన్ సామ్రాజ్యం నుంచి ఈజిప్ట్ కైవసం చేసుకుంది. కొద్ది సంవత్సరాలలోనే బ్రిటన్ జోక్యం చేసుకుని ఈ ప్రాంతాన్ని మళ్లీ ఆటోమన్ సామ్రాజ్యంలో చేర్చింది గాని అది ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్య ప్రభావంలోనే ఉండింది.

ఈ లోగా 1897లో థియొడర్ హెర్జెల్ అనే యూదు సిద్ధాంత కర్త జియోనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఆ సిద్ధాంతం బైబిల్ లోని బుక్ ఆఫ్ జెనెసిస్ లో ఈ ప్రాంతాన్ని అబ్రహాం వారసులకు ఇస్తున్నట్టుగా భగవంతుడు చెప్పాడని, దానిపేరు ఇజ్రాయెల్ అని, తాము అబ్రహాం వారసులమని, అందువల్ల ఇది తమకు చెందాలని వాదించడం మొదలుపెట్టింది. ఈ జియోనిజం ప్రారంభకులూ, సమర్థకులూ ప్రధానంగా యూదులు. వడ్డీ వ్యాపారులుగా, వర్తకులుగా, సంపన్నులుగా యూదుల పట్ల అప్పటికి మూడు నాలుగు వందల ఏళ్లుగా యూరప్ లో ఉండిన వ్యతిరేక భావనల వల్ల యూదులను ఏకం చేసి, వారికే ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచడం జియోనిజం లక్ష్యం. ఇది భగవంతుడి ఆదేశంగా మాత్రమే కాక, “భూమిలేని ప్రజలకు, ప్రజలు లేని భూమి” అనే నినాదాన్ని కూడ తీసుకుంది. కాని పాలస్తీనా ప్రజలు లేని భూమి కాదు, అక్కడ నిండా అరబ్బులు ఉన్నారు.

మత విశ్వాసాల ప్రకారం పాలస్తీనా జనాభా అప్పటికి పూర్తిగా ముస్లింలు కాగా ఇది యూదు – ముస్లిం మత వైరంగా కూడ బలపడింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులైనా ఈ తమ మాతృభూమికి వెళ్లి స్థిరపడాలని అంటూ భారీ వలసలను ఈ జియోనిజం ప్రోత్సహించింది. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో వెలువడిన బాల్ ఫోర్ డిక్లరేషన్ తో ఈ నినాదం ప్రచారంలోకి రాగా బ్రిటన్ ఈ జియోనిస్టు వలసలను పూర్తిగా సమర్థించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి పాలస్తీనా భూభాగమంతా బ్రిటన్ చేజిక్కింది. పాలస్తీనీయులు బ్రిటన్ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసేవరకూ పాలస్తీనా బ్రిటన్ చేతిలోనే ఉండిపోయింది.

చివరికి 1947లో పాలస్తీనా మీద తన అధికారం వదులుకుంటున్నానని ప్రకటించిన బ్రిటన్, అప్పటికే బలపడిన అమెరికాలు ఐక్యరాజ్యసమితి చేత ఒక తీర్మానం చేయించాయి. ఆ తీర్మానం ప్రకారం పాలస్తీనాను మూడు భాగాలుగా విడగొట్టారు. ఒకటి అరబ్ రాజ్యం, ఒకటి యూదుల రాజ్యం. మరొకటి అంతర్జాతీయ సంస్థల అదుపులో ఉండే జెరూసలెం నగరం. అరబ్బుల నేలలో ఉన్న, తనకు అత్యంత అవసరమైన చమురు కోసం వారితో తనకు ఎప్పటికైనా ఘర్షణ తప్పదని, విభిన్న మతవిశ్వాసాల వల్ల ఆ ఘర్షణ సమసిపోవడం సాధ్యం కాదని గుర్తించిన అమెరికా అరబ్బు దేశాల పక్కలో బల్లెంలా ఇజ్రాయెల్ ను తయారుచేసి, దాన్ని తన కీలుబొమ్మగా మార్చుకోవాలని చేసిన దురాలోచన ఫలితమే యూదుల రాజ్యంగా ఇజ్రాయెల్ ఏర్పాటు.

ఈ విభజనను వ్యతిరేకించిన అరబ్బులు యుద్ధం ప్రారంభించారు. అయినా ఇజ్రాయెల్ ఏర్పాటు కావడం మాత్రమే కాదు, ఐరాస తీర్మానంలో లేని మరొక 26 శాతం భూభాగం మీద కూడ ఇజ్రాయెల్ తన పాలన స్థాపించుకుంది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన ఏడు లక్షల మంది పాలస్తీనీయులు శాశ్వతంగా శరణార్థులయిపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనాలో కొంత భాగం జోర్డాన్ చేతికీ, కొంత భాగం ఈజిప్ట్ చేతికీ వెళ్లాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో ఈ రెండు దేశాల నుంచి పాలస్తీనా భాభాగాల్ని ఇజ్రాయెల్ కైవసం చేసుకుంది.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో, ముఖ్యంగా యూరప్ లో నాజీ హిట్లర్ అత్యాచారాలకు బలి అయిన యూదులు శరణార్థులుగా ఈ ప్రాంతానికి వలస రావడం ప్రారంభించారు. నిజానికి హిట్లర్ దుర్మార్గాలను తప్పించుకోవడానికి వలస వచ్చిన ఈ శరణార్థుల వలసలను మానవతా దృష్టితో సమర్థించవలసిందే గాని, వారు పాలస్తీనాలో స్థానికులను తోసివేసి, స్థానికుల భూమిని ఆక్రమించుకుని, వారినే శరణార్థులుగా మార్చివేశారు.

పాలస్తీనాను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పరచాలనే లక్ష్యంతో 1964లో ఏర్పడిన పాలస్తీనా విమోచన సంస్థ (పి ఎల్ ఒ) యాసర్ అరాఫత్ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవాదరాలు సంపాదించుకుంది. వంద దేశాలు పి ఎల్ ఒ ను గుర్తించాయి. ఐక్యరాజ్యసమితి పిఎల్ ఒ ను గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్ లు మాత్రం దాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ రాజకీయ, అర్థ సైనిక జాతీయ విమోచనా సంస్థ పాలస్తీనా విముక్తి కోసం రాజకీయ, దౌత్యపరమైన పోరాటం చేస్తూనే సాయుధ పోరాటాన్ని కూడ చేపట్టింది. ఆ సాయుధ పోరాటాలు అనేక మలుపులు తిరిగాయి.

ఐక్య  రాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ కు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి మద్దతుగా జరిగిన తీర్మానాలకు లెక్కలేదు. ఆ తీర్మానాల అమలు ప్రసక్తి వచ్చేసరికి అమెరికా, బ్రిటన్ లు వీటో ప్రకటించి అడ్డుకునేవి. సుదీర్ఘకాలం ఘర్షణల తర్వాత 1993లో పి ఎల్ ఒ కు ఇజ్రాయెల్ కు మధ్య నార్వే లోని ఓస్లోలో శాంతి ఒప్పందం కుదిరింది. పి ఎల్ ఒ సాయుధ పోరాటాన్ని విరమించి, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనీయులకు గాజా నగరంలో, వెస్ట్ బ్యాంక్ లో, జెరికోలో పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అంటే ఒక దేశపు పౌరులను అణచివేసి, నిర్వాసితులను చేసి, వారి మీద నాలుగు దశాబ్దాలకు పైగా యుద్ధం చేసి, చివరికి వారి దేశంలో పదో వంతు భూభాగం మీద వారికి పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. పాలస్తీనాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ పి ఎల్ ఒ నాయకత్వాన మరొక సాయుధ పోరాటం జరగడంతోపాటు పి ఎల్ ఒ రాజీని వ్యతిరేకించే సంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. అటువంటి సంస్థలలో ఒకటైన హమస్ గాజా నగరంలో అధికారానికి కూడ వచ్చింది.

ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చి, తమ నేల మీద తమ పాలన నడుపుకుంటున్న హమస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, పాలస్తీనియన్లకు మిగిలిన ఆ నేలచెక్కను కూడ కబళించడానికి, పాలస్తీనియన్లను బెదిరించడానికి ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర కుటిల ప్రయత్నాలలో భాగమే తాజా బాంబుదాడులు.

Wednesday, 5 March 2014

మృత్యువా ఒక్కసారి వచ్చిపోవే.....by .శ్రీ..శ్రీ

మృత్యువా ఎక్కడున్నావు....?
అడుగడుగునా మోసం..అడుగడుగునా ద్రోహం..?
నిజాయితీ లేని మనుషులు ..
వాళ్ళ స్వార్దం నన్ను దోషిని చేస్తే..?
ఒకటా రెండా ప్రతిచోట ప్రతి విషయంలో
నాకే ఎందుకిలా జరుగుతుందో
మరణమా ఒక్కసారి నన్ను కబలించు ఎందుకు బయపడుతున్నావు
మరణమా అందరూ నాతో నా జీవితంతో గేం ఆడి నట్టే నీవు నటిస్తున్నావా..?
మృత్యువా నీకూ నేనంటే చిన్నచూపా ..ఎందుకని..?
మనిషి ఒక్కసారే ఓడి పోతాడు కాని నాలా ప్రతిక్షనం ఓడిపోడు..
నేను నమ్మిన మనుషులే నన్ను దగ్గరుండీ ఓడించి నవ్వుకుంటున్నారు..
ఎవ్వరికైనా గుండెకు గాయం ఒక్కసారే జరుగుతుంది
మరి నాకేంటీ ప్రతిదీ గాయం అవుతోంది
ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు చేయని తప్పులకు బలి అవుతున్నా
ఇలా ప్రతిక్షనం చస్తూ బ్రతికే కంటే ఒక్కసారిగా..?
అందుకే మృత్యువా ఎక్కడ
నీవు కూడా నాదగ్గరికి రావడానికి బయపడుతున్నావా
నీవు ఎందుకు బయపడుతున్నావు నాకు ..నీవుకూడా నాతో నాటకాలాడుతున్నావా
మృత్యువా నాదగ్గరకు రావడాని ఎందుకు బయపడుతున్నావు..?
ప్రతిక్షనం చస్తూ బ్రతికే కంటే ఒకేసారి .
Plezeee మరి మృత్యువా వచ్చి నన్ను కబలించు.

Courtesy : శ్రీ శ్రీ

Monday, 3 March 2014

ఎలక్షన్‌ కోడ్‌

ఎలక్షన్‌ కోడ్‌ క్రమశిక్షణ సంబందించి నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు వాటి సమాదానాలు:



 సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు మార్గదర్శక ప్రవర్తనా నియమావళి

 ప్రశ్న: 2. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఎన్నికల సంఘం పాత్ర ఏమిటి?

 జవాబు: భారత రాజ్యాంగం 324 ప్రకారం పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లిలకు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా ఎన్నికల్ని నిర్వహించడంలో తన రాజ్యాంగపరమైన విధుల్ని నిర్వర్తించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంలోను, రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న రాజకీయపక్షాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సాక్షిగా ప్రయత్నిస్తుంది. ఎన్నికల ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం దుర్వినియోగానికి గురికాకుండా అది నియంత్రిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఓటర్లని ప్రభావితం చేయడం, వారికి లంచాల్ని చూపి ప్రలోభపెట్టడం, వారిని భయపెట్టడం, అవమానించడం వంటి నేరాలు, అక్రమాలు, లంచగొండి కార్యకలాపాలు జరగకుండా అన్ని విధాలా నిరోధిస్తుంది. నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తే తగుచర్యలు తీసుకుంటుంది.

 ప్రశ్న: 3. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మార్గదర్శక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది?

 జవాబు: ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన తారీఖు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది.

ప్రశ్న: 4. సాధరణ ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ఈ ప్రవర్తనా నియమావళి ఎంత వరకు వర్తిస్తుంది?

జవాబు: ఎ. లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుంది. బి. విధాన సభకు జరిగే సాధారణ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంటుంది. సి. ఉప ఎన్నికల సమయంలో ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గం ఏ జిల్లా లేదా జిల్లాలలో ఉంటుందో ఆ జిల్లా అంతటా అమల్లో ఉంటుంది.

 ప్రశ్న: 5. మార్గదర్శక ప్రవర్తనా నియమావళి లోని ముఖ్యమైన అంశాలేమిటి?

 జవాబు: ప్రవర్తనా నియమావళి రాజకీయ పార్టీలు, అధికార పక్షాలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది. అంటే, ఎన్నికల్లో వారి ప్రవర్తనా సరళి, సభలు, సమావేశాలు, ప్రదర్శనల్ని నిర్వహించే తీరుతెన్నులన్నింటికీ సంబంధించి ఇది నియమావళిని వివరిస్తుంది.అధికార యంత్రాంగానికి సంబంధించి...

 ప్రశ్న: 6. ఒక మంత్రి తన అధికార పర్యటనను, ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మిళితం చేయవచ్చునా? జవాబు: మంత్రులు తమ అధికార పర్యటనల్ని, ఎన్నికల ప్రచారానికి కలపకూడదు. అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోరాదు.

 ప్రశ్న: 7. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రవాణా సౌకర్యాల్ని వాడుకోవచ్చునా?

జవాబు: వీల్లేదు,అధికార వైమానిక సౌకర్యాల్ని, వాహనాల్ని వాడుకోరాదు. ఏ పార్టీ లేదా అభ్యర్థి ప్రయోజనం కోసం వీటిని వాడనే కూడదు.

ప్రశ్న: 8. ఎన్నికల ప్రక్రియ నిమిత్తం ప్రభుత్వం అధికారుల్ని బదిలీ చేయడం, నియామకాలు జరపడం వంటివి చేయవచ్చునా?

జవాబు: ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అధికారుల బదిలీ/ నియామకాలపై పూర్తి స్థాయి నిషేధం అమల్లో ఉంటుంది. ఏ అధికారి బదిలీ లేదా నియామకం అవసరమైన పక్షంలో ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతినిపొందాలి.

 ప్రశ్న: 9. మార్గదర్శక ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ఒకవేళ ఒక అధికారిని ఎన్నికల ప్రక్రియ నిమిత్తం ప్రభుత్వం బదిలీ చేసినట్టయితే, ఆ అధికారి నూతన పదవీ బాధ్యతల్ని స్వీకరించనట్టయితే, ప్రవర్తనా నియమావళిని ప్రకటించిన తరువాత అతను పదవీ బాధ్యతల్ని స్వీకరించవచ్చునా?

జవాబు: యధాతథ స్థితి కొనసాగుతుంది.

 ప్రశ్న:10. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక అయిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు పాల్గొనవచ్చునా? జవాబు: వీల్లేదు. ప్రభుత్వ నిధుల్ని వినియోగించి జరిపే అలాంటి వేడుకల్లో ముఖ్యమంత్రి కానీ, మరే ఇతర మంత్రులు కానీ పాల్గొనరాదు. ఆ వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే పాల్గొనాలి.

 ప్రశ్న: 11. ఎన్నికల సమయంలో ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రావతరణ దినోత్సవాల్లో ముఖ్యమంత్రి/మంత్రి/స్పీకర్‌ పాల్గొనవచ్చునా?

 జవాబు: ఆ సందర్భంగా అతను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యల్ని చేయని పక్షంలో, ఆ వేడుకను ప్రభుత్వాధికారులే నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి/మంత్రి/స్పీకర్‌ అలాంటి వేడుకల్లో పాల్గొనడంపై ఎలాంటి అభ్యంతరమూ లేదు.

 ప్రశ్న: 12. ఎన్నికలు జరుగుతున్నపుడు ఏదైనా విద్యా సంస్థకు, విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్నాతకోత్సవంలో గవర్నర్‌/ముఖ్యమంత్రి/మంత్రులు పాల్గొనవచ్చునా?

జవాబు: స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం స్నాతకోత్సవంలో పాల్గొనరాదన్న సూచన ఉంది.

 ప్రశ్న: 13. సంబంధిత ఖర్చుల్ని ప్రభుత్వ ఖజానా భరిస్తూ 'ఇఫ్తార్‌ విందు' లేదా అలాంటి విందు కార్యక్రమాల్ని రాజకీయ ప్రముఖుల నివాసాల్లో ఏర్పాటు చేయవచ్చునా?

 జవాబు: వీల్లేదు. కానీ ఏ వ్యక్తికి అయినా తన వ్యక్తిగత సామర్థ్యాన్ని అనుసరించి, సొంత ఖర్చులతో వ్యక్తిగతంగా అలాంటి విందుల్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

ప్రశ్న: 14. రాష్ట్ర అసెంబ్లిdలో బడ్జెట్‌ సెషన్‌ని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించడంపై ఎలాంటి ఆంక్షలైనా ఉన్నాయా? జవాబు: లేవు.

 ప్రశ్న 15: ఎన్నికల సంఘం నుంచి ప్రత్యక్షంగా రాష్ట్రప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనకు సంబంధించి వివరణను/ఆమోదాన్ని కోరవచ్చునా?

జవాబు: ఇలాంటి ఏదైనా ప్రతిపాదనకు సంబంధించిన అభ్యర్థనను రాష్ట్రప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా మాత్రమే పంపాలి. ఆయనే దీనికి సంబంధించి సిఫారసు చేయడం లేదా మరో విధంగా ప్రతిస్పందించడం వంటివి చేస్తాడు. ఎన్నికల ప్రచారం

 ప్రశ్న 16: ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు/ అభ్యర్థులకు వర్తించే ప్రధాన మార్గదర్శక సూత్రాలేమిటి?
జవాబు: ఎన్నికల ప్రచార సమయంలో ఏ పార్టీ లేదా అభ్యర్థి కుల, మత, భాషా పరమైన విభిన్న సమూహాల మధ్య ఇదివరకే ఉన్న పరస్పర వైషమ్యాల్ని రెచ్చగొట్టేలా, లేదా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడరాదు. ఇతర పార్టీల గురించిన విమర్శలు కేవలం ఆ పార్టీల గత ప్రవర్తన, విధానాలకు, కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి. ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తల, నాయకుల, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విమర్శలకు పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలపై ఆధారరహితమైన ఆరోపణలు, విమర్శలు చేయకూడదు.

 ప్రశ్న 17: మతపరమైన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడానికి సంబంధించి ఏవైనా ఆంక్షలు ఉన్నాయా?
జవాబు: ఉన్నాయి. గుడి, మసీదు, చర్చి, గురుద్వారా, లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించుకోరాదు. అంతేగాక ఓట్ల కోసం మతాన్ని లేదా కులాన్ని కించపరిచే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టకూడదు.

 ప్రశ్న 18: ఒక అభ్యర్థి నామినేషన్‌ను దాఖలు చేయడానికి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి తన మద్దతుదారులతో ప్రదర్శనగా వెళ్లవచ్చునా?
 జవాబు: వీల్లేదు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఆవరణలో వందకిలోమీటర్ల పరిధిలో మూడుకు మించి వాహనాల్ని నిలపడానికి వీల్లేదు. అలాగే కార్యాలయంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య మీద కూడా పరిమితి ఉంది. అభ్యర్థితో సహా ఐదుగురు మాత్రమే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించాలి.

 ప్రశ్న 19: రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ పత్రాల పరిశీలనకు ఉపక్రమించిన సమయంలో అక్కడ ఎంతమంది వ్యక్తులకు అనుమతి ఉంటుంది?
 జవాబు: అభ్యర్థితోపాటు అతని తరఫు ఎన్నికల ఏజెంట్‌, నామినేషన్‌ను బలపరిచే వ్యక్తి, మరో వ్యక్తి (ఇతను న్యాయవాది అయి ఉండవచ్చు) మాత్రమే అభ్యర్థి రాతపూర్వక అభ్యర్థన ప్రకారం రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ పత్రాల పరిశీలనకు ఉపక్రమించిన సమయంలో అక్కడ ఉండడానికి అర్హులు. మరే ఇతర వ్యక్తీ ఆ సమయంలో అక్కడ ఉండకూడదు.

 ప్రజాప్రతినిధుల చట్టం 1951, సెక్షన్‌ 36 (1)ని పరిశీలించండి

Monday, 17 February 2014

రెండుగా చీలి పోయిన మీడియా


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. తెలంగాణ విభ‌జ‌న అంశం రాష్ర్టంలో అన్ని వ‌ర్గాల‌ను, సంస్థ‌ల‌ను రెండుగా చీల్చింది. అయితే దేశంలోనే అత్య‌ధికంగా ఛాన‌ల్స్‌ ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీడియా.. ఇప్పుడు ప్రాంతాల వారిగా ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌నటంలో సందేహం లేదు. త‌మిళ‌నాడు మాదిరిగానే రాజ‌కీయ నేప‌థ్యంలో మీడియ వ్య‌వ‌హిరించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయమైంది. తెలంగాణ ఉద్య‌మం మొద‌ల‌వ‌గానే ఆ ప్రాంతానికి చెందిన మీడియా సంస్థ‌లు రాష్ర్ట సాధ‌నే ల‌క్ష్యంగా ప‌నిచేశాయి. అదే స‌మ‌యంలో సీమాంధ్ర‌కు చెందిన మీడయా కూడా ఉద్య‌మాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాయి. అయితే తెలంగాణ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించ‌గానే మీడియా రెండుగా చీలిపోయింది. విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా సీమాంధ్ర‌లో ఉద్య‌మం మొద‌ల‌వ‌గానే, త‌మ ప్రాంతాన్ని ప్ర‌తిబింబించడం మొద‌లు పెట్టాయి. సీమాంధ్ర‌, తెలంగాణ‌.. ఇలా ఏ ప్రాంతానికి చెందిన యాజ‌మాన్యాలు ఆ ప్రాంత ఉద్య‌మాల‌ను, పరిస్థితుల‌ను ప్రసారం చేయ‌టం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఆగ‌స్టులో ప్రారంభ‌మైన మెట్రో ఇండియా, న‌మ‌స్తే తెలంగాణ‌కు అనుబంధ ప‌త్రిక‌గా అర్థం చేస‌సుకోవ‌చ్చు. అయితే దీని ప్రారంభ‌ స‌భ‌లో బీజేపీ నేత‌ వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ.. ప‌త్రిక విశ్వ‌స‌నీయ‌త పొందాలంటే రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని అన్నారు. అలాగే సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న‌మ‌స్తే తెలంగాణ రాజ‌కీయ అవ‌స‌రాల నుంచి పుట్టుకొస్తే, మెట్రో ఇండియా ఇంగ్లీష్ జ‌ర్న‌లిజం మీద రాజంకున్న మ‌మ‌కారంతోటి పుట్టింద‌ని తెలిపారు. అయితే ప్రాంతాల‌కు అతీతంగా, నిజాల‌ను నిగ్గు తేల్చిన‌పుడే పత్రిక ప్ర‌జలంద‌రి విశ్వ‌నీయ‌త చూర‌గొంటుంద‌ని అన్నారు. ఇక టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్‌, ప‌త్రిక ఎండీ, సీఎల్ రాజం మాట్లాడుతూ.. హైద‌రాబాద్ ఘ‌న‌త‌ను, ఈ ప్రాంత సంస్కృతిని దేశవ్యాప్తంగా చాటి చెప్ప‌నున్న‌ట్లు తెలిపారు. ఏదైతేనేం.. త‌మ ప్రాంతీయ‌ను చాటిచెప్ప‌టానికి పత్రిక ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌టంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా ప్రాంత‌, కుల‌, వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌వ‌చ్చు. అది టీవీ ఛానల్‌లో కావ‌చ్చు, ప్ర‌తిక‌ల్లో కావ‌చ్చు. తెలుగు దేశం పార్టీకి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నది క‌మ్మ స‌మాజానికి చెందిన‌ది కాగా, కాంగ్రెస్‌, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ కు మ‌ద్ధ‌తిస్తున్న‌ది రెడ్డి మీడియా అని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అలాగే వెలమ వ‌ర్గానికి మ‌ద్ధ‌తిస్తున్న మీడియాలో హెచ్ఎమ్ టీవీ, సూర్య పత్రికలు లేక‌పోలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా వ‌ర‌కు మీడియాకు రాజ‌కీయ నాయ‌కులే య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మీడియా ప‌లుకుబ‌డి ఉప‌యోగించి వారు రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌నుకోవ‌టం గ‌మ‌నార్హం. జీ24 గంట‌లు ఛానల్ రాష్ర్ట కాంగ్రెస్ అధ్య‌క్షుడి కుటుంబానికి చెందిన‌ది తెలిసిన విష‌య‌మే. అలాగే మ‌రో ప‌త్రిక‌, ఛాన‌ల్ కూడా ప‌రోక్షంగా ఒక ముఖ్య‌నేత న‌డుపుతున్నారు. ఏ టీవీ, ఐ న్యూస్ లాంటివి ముఖ్య‌మంత్రి కుటుంబానికి చెందిన వారి చేతుల్లోకి మారడం మ‌రో ప‌రిణామం. అలాగే క‌మ్యూనిస్టుల గ్రూపుకు చెందిన 10 టీవీ ప్రస‌సారాలు ప్రారంభించింది. లెఫ్ట్ పార్టీకి చెందిన టీవీ 99 కూడా త్వ‌రలో రానుంది. ఈ నాయ‌కుల యాజ‌మ‌న్యంలో ఉన్న మీడియా వారి వారి విష‌యాల‌ను ప్ర‌సారం చేయ‌టంలో నిమ‌గ్న‌మైంది. 16 నెల‌లుగా జైల్లో ఉన్న జ‌గ‌న్ కున్న ధీమా కూడా త‌న‌కున్న మీడియా ద్వారా ప్ర‌భావం చూప‌వ‌చ్చున‌నుకోవ‌ట‌మే. పత్రిక‌ల విష‌యానికొస్తే కాస్త భిన్న‌మైన ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. గ‌త 30 ఏళ్లుగా మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్న ఈనాడుకు ఇప్ప‌టికి కూడా తెలంగాణ‌లో ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. న‌మస్తే తెలంగాణ ప‌త్రిక వ‌చ్చినా అంత ప్ర‌భావం చూప‌లేక పోయింది. 2013లో ఏబీసీ వెలువ‌రించిన వివ‌రాల ప్ర‌కారం.. కేవ‌లం తెలంగాణ ప్రాతంలో ఈనాడుకు 7,67,980 స‌ర్క్యులేషన్ ఉంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే దాదాపు ల‌క్ష వ‌ర‌కు స‌ర్క్యులేష‌న్ ఉంది. అలాగే సాక్షికి 4,80,100 స‌ర్క్యులేష‌న్ ఉండ‌టం గ‌మ‌నార్హం. 2011లో ప్రారంభ‌మైన న‌మ‌స్తే తెలంగాణ ఈ రెండు పత్రికల‌ను అధిగ‌మించలేక పోయింది. అయ‌తే మీడియా విభ‌జ‌న అయిన త‌ర్వాత పాఠ‌కులు అభిప్రాయం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక టీ న్యూస్‌, హెచ్ఎంటీవీ, వీ6 లాంటి తెలంగాణ‌కు చెందిన ఛాన‌ల్‌లు ప్రారంభ‌మ‌య్యాక ఆ ప్రాంత ప్ర‌జ‌ల అభిరుచులు మారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ మీడియా హ‌వా మొద‌లైంద‌ని అంటున్నారు. అయితే మీడియా యాజ‌మాన్యాలు కూడా ఎవ‌రికి వారు స‌మ‌ర్థించుకుంటున్నారు. త‌మ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను, ప్ర‌జానీకాన్ని ప్ర‌తిబింబించ‌డం త‌మ మొద‌టి విధి అని చెబుతున్నారు. న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ అల్లం నారాయ‌ణ మాట్లాడుతూ.. త‌మ పత్రిక ఏర్ప‌డ‌ట‌మే తెలంగాణను ప్ర‌తిబింబించేందుక‌ని, అందుకే తాము ఆ ప్రాంతానికి చెందిన విష‌యాల‌కు ప్రాధాన్య‌తనిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణ నుంచి గ‌తంలో మీడియా వేళ్లూనుకోక పోవ‌టానికి కార‌ణం అడిగితే.. తెలంగాణ‌లోని పెత్తందార్లు మీడియా లాభ‌సాటి వ్యాపారం కాక‌పోవ‌టం వ‌ల్ల దానికి దూరంగా ఉన్నారు. విశ్లేష‌ణ‌లు ఎలా ఉన్నా.. ప్రాంతాల వారిగా మీడియా కూడా రెండుగా చీలిపోయింద‌నంటంలో సందేహం లేదు. ఈ కొత్త ట్రెండ్ విభ‌జ‌న ప‌రిణామాల నేప‌థ్యంలో పుట్టుకొచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.